సుమతో పెళ్లికి రాజీవ్ అలాంటి కండిషన్స్ పెట్టారా?

బుల్లితెర కార్యక్రమాలకు మకుటం లేని మహారాణిగా స్టార్ మహిళగా కొనసాగుతూ ఎన్నో కార్యక్రమాలని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి వారిలో యాంకర్ సుమ( Suma ) ఒకరు.ఈమె బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఏ సినిమా వేడుక జరిగిన తప్పకుండా అక్కడ సుమ ఉండాల్సిందే సుమ చేత ఆ సినిమా వేడుక నిర్వహిస్తే మరింత హైప్ వస్తుందని దర్శక నిర్మాతలు కూడా భావిస్తూ ఉంటారు.

 Did Rajiv Set Such Conditions For Sumas Marriage, Suma, Rajeev Kanakala, Tollywo-TeluguStop.com

అలా టీవీ రంగంలో ఎంతో బిజీగా మారిపోయినటువంటి సుమ క్షణం పాటు తీరికలేకుండా గడుపుతున్నారు.

Telugu Rajeev Kanakala, Suma, Tollywood-Movie

ఇకపోతే సుమ నటుడు రాజీవ్ కనకాలనుs( Rajeev Kanakala ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే సుమ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె రాజీవ్ కనకాల గురించి మాట్లాడుతూ ఆయన పెళ్లి చేసుకోవడానికి ముందు తనకు కొన్ని కండిషన్స్ పెట్టారు అంటూ ఈమె అసలు విషయం బయట పెట్టారు.1994 వ సంవత్సరంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అయితే 99 లో వీరి వివాహం( Marriage ) జరిగిందని సుమ తెలియజేశారు.

Telugu Rajeev Kanakala, Suma, Tollywood-Movie

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో రాజీవ్ కనకాల తనని పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదు అనే కండిషన్ పెట్టారట తనకు ఇలాంటి కండిషన్ పెట్టడంతో అది నచ్చక సుమ కొద్ది రోజులపాటు తనతో బ్రేకప్ చెప్పుకొని రెండు సినిమాలలో నటించారని తెలియజేశారు.అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తాను సినిమాల్లోకి వెళ్ళకూడదని భావించారట.ఆ సమయంలోనే తిరిగి రాజీవ్ కనకాలతో మాట్లాడి వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి అనంతరం పెళ్లికి ఒప్పించారట.

ఇక పెళ్లి తర్వాత సుమ సినిమాలకు దూరమైన బుల్లితెర కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చారు.అయితే తను చేసే ఏ వేడుకకి అయినా మొదటి విమర్శకుడు రాజీవ్ కనకాలేనని ఆయన బాగుంటే బాగుంది లేకపోతే లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తారని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube