ధమాకా.ఇప్పుడు ఎక్కడ చూసిన మాస్ మహారాజా రవితేజ సినిమా పేరునే వినిపిస్తుంది.
క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత రెండు భారీ డిజాస్టర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.మాస్ రాజా ఈసారి మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమానే ధమాకా.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ధమాకా’.
విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు.భారీ అంచనాలతో ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగాడు రవితేజ.ధమాకా మొదటి రోజునే సాలిడ్ వసూళ్లు రాబట్టింది.మాస్ రాజా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.ఏకంగా 10 కోట్ల గ్రాస్ రాబట్టి ఆ రోజే సంచలనం క్రియేట్ చేసింది.ఆ తర్వాత ఈ సినిమా వీకెండ్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది.వీకెండ్ లోనే 30 కోట్లు క్రాస్ రాబట్టింది.
దీంతో ఈ సినిమా రవితేజ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అందరు భావించారు.అనుకున్న విధంగానే ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లో భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.
ఇక ఇప్పుడు ధమాకా సినిమా సెన్సేషనల్ మార్క్ చేరుకోబోతుంది.ఈ సినిమా అతి త్వరలోనే 50 కోట్ల క్లబ్ లో చేరిపోనుంది.5 రోజుల్లో ఈ సినిమా 49 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ఈ రోజు గడిస్తే 50 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది.
రెండు డిజాస్టర్స్ తర్వాత సాలిడ్ హిట్ అందుకుని మాస్ రాజా తన స్టామినా చూపించాడు.చూడాలి ఈ కలెక్షన్స్ ఎక్కడ ఆగుతుందో.