మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా తాజాగా హత్య కేసులో రహస్య సాక్షి వివరాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది.
ఈ క్రమంలో పులివెందులకు చెందిన వైసీపీ నేత కొమ్మ శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేశారు.కడప ఎంపీగా అవినాశ్ రెడ్డి పోటీ చేయరని వివేకా తనతో చెప్పారని శివచంద్రారెడ్డి తెలిపారని తెలుస్తోంది.2018 అక్టోబర్ 1న ఇంటికొచ్చి వైసీపీని వీడొద్దని తనను కోరారని చెప్పారు.ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డితో తాను పని చేయలేనని వివేకాతో చెప్పానని పేర్కొన్నారు.
అవినాశ్ కు జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు వివేకా చెప్పారని తెలిపారు.సిట్ కు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉన్నట్లు శివచంద్రారెడ్డి చెప్పారన్న వివరాలను సీబీఐ కోర్టుకు వెల్లడించింది.