కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ మార్కెట్ యార్డ్ లో ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూరగాయల కొనుగోలు చేసిన దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని.మార్కెట్ యార్డులో ప్రతి ఒక్క కూరగాయల్ని పరిశీలించి కొనుగోలు చేస్తున్న చింతమనేని.
దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని కామెంట్స్.ప్రకృతి వైపరీత్యం వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చడం దానివల్ల కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైనవి.
వరదకు ఏమైతే ప్రాంతాలు ముంపుకు గురైనవో ఆ ప్రాంతాలను పట్టించుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది.ప్రభుత్వ అధికారులు కొన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించిన వారికి బియ్యం, పప్పు, ఉప్పు, కారం, నూనె, ఏ నిత్యవసరమైన సరుకు అందని వైనం.
ప్రభుత్వం కొన్ని ఆహార సెంటర్ నియమించిన ఉడికి ఉడకని అన్నం పంపిణీ చేస్తున్నారు.మేము అధికారంలో ఉన్నా లేకపోయినా వరద బాధితులకు ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.1600 కుటుంబాల్ని కి ఉదయం పాల ప్యాకెట్లు పంపిణీ చేసాం.14 నుంచి 15టన్నుల వరకు కూరగాయలు కూడా పంపిణీ చేస్తున్నాం.వరద ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే తప్పితే బాధితులకు నూటికి నూరు శాతం ఎవరికైనా ఆహార పొట్లాలు ఇచ్చాడా.ఏపీకి కొత్తగా ఏడు మండలాలు ఏమైతే కలిసాయో అవి కాకుండా ఆచంట ప్రాంతమంతా ముంపుకు గురైంది.
ముంపుకు గురైన ప్రాంతాల్లో శాసన సభ్యులు గాని మంత్రి గాని కలెక్టర్ గాని ఒక ప్రభుత్వ యంత్రాంగంగాని సరైన రీతిలో స్పందించారా.ముంపు ప్రాంతాల్లో ప్రజలు పసిపిల్లలు సైతం ఆకలితో అలమటిస్తుంటే ఎవరైనా స్పందిస్తున్నారా.
మూడు సంవత్సరాల బట్టి ముంపు గురైన కుటుంబానికి 2000 చొప్పున సాయం అందించాలి గడచిన రెండు సంవత్సరాల్లో ఇవ్వకపోయినా ఈ సంవత్సరమైనా తక్షణ సాయం 2000 ఇవ్వాలి అని చింతమనేని డిమాండ్.రేపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంపుకు గురైన తుక్కులూరు, వేలూరుపాడు పర్యటించనున్న చంద్రబాబు.