బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ”జవాన్”.ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
అందులోను షారుఖ్ పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తో కొన్నేళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.ఇదే ఊపులో వెంటనే జవాన్ సినిమాను చేయడంతో ఈ సినిమా కూడా ఓ రేంజ్ లో అంచనాలతో రిలీజ్ అయ్యింది.
కృష్ణాష్టమి సందర్భంగా వరల్డ్ వైడ్ గా జవాన్ ( Jawan )రిలీజ్ అవ్వడంతో అప్పటి నుండి థియేటర్స్ లో జవాన్ మానియా స్టార్ట్ అయ్యింది.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.
ఇక ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.
కాగా ఇందులో దీపికా పదుకొనె ( Deepika Padukone )కీ రోల్ పోషించింది.ఈ జంట ఇప్పుడే కాదు చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.షారుఖ్ ఖాన్, దీపికా కలిసి పఠాన్ తో కూడా సూపర్ హిట్ అందుకున్నాక మళ్ళీ ఈ సినిమాలో నటించారు.
జవాన్ పఠాన్ సినిమాను మించి హిట్ అవ్వడంతో ఈ జంట ఫుల్ ఖుషీగా ఉంది.ఈ ఆనందం వీరి తాజాగా ఫొటోలోని కనిపిస్తుంది.
జవాన్ వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను సాధించడంతో సక్సెస్ మీట్ ను బాలీవుడ్ లో నిర్వహించారు.ఈ ఈవెంట్ లో షారుఖ్ ఖాన్ తో పాటు విజయ్ దెతుపతి, డైరెక్టర్ అట్లీ, దీపికా పాల్గొన్నారు.మరి ఈ ఈవెంట్ లో దీపికా షారుఖ్ ఖాన్ ను ముద్ధాడిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ జంట ఆనందం ఈ పిక్ తోనే బయట పడింది.
దీంతో ఈ పిక్ సోషల్ మాధ్యమాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.