డిసెంబర్ నెల నాకు ఎప్పుడు అదృష్టమే: రష్మిక

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) .ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ క్షణం పాటు తీరికలేకుండా గడుపుతున్నారు.

 December Lucky F Or E Now Rashmika, Rashmika ,animal, Ranbir Kapoor, December M-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.ఇకపోతే తాజాగా రష్మిక నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Telugu Allu Arjun, Animal, Bollywood, December, Pushpa, Ranbir Kapoor, Rashmika-

ఈ క్రమంలోనే తన సినిమాల విడుదల గురించి రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) రష్మిక జంటగా నటించిన యానిమల్ ( Animal ) సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.అయితే డిసెంబర్ నెల తనకు ఎంతో అదృష్టమంటూ రష్మిక తన సినిమాలో విడుదల గురించి తెలిపారు.ఈమె మొదటి సినిమా కిరిక్ పార్టీ సినిమా 2016 డిసెంబర్ నెలలో విడుదల ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

అదేవిధంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా 2021 డిసెంబర్ నెలలో విడుదల అయ్యి ఈమెకు ఎంతో మంచి సక్సెస్ అందించింది.

Telugu Allu Arjun, Animal, Bollywood, December, Pushpa, Ranbir Kapoor, Rashmika-

ఈ సినిమా ద్వారా రష్మిక పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందడమే కాకుండా వరుసగా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ సాధించారు.ఈ విషయం గురించి రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… డిసెంబర్ ( December ) నాకు ఎప్పుడూ అదృష్ట నెల.కిరిక్ పార్టీ, చమక్, అంజనీపుత్ర, పుష్ప సహా పలు చిత్రాలు ఈ నెలలో విడుదలయ్యాయి.ఈ నెలలో విడుదలైన చిత్రాలకు మంచి ఆదరణ లభించింది.నా ఐదవ యానిమల్ డిసెంబర్‌లో విడుదల కానుంది.నేను థ్రిల్‌గా ఉన్నాను’ అని తెలిపింది.మరి ఈమె సెంటిమెంట్ ప్రకారం డిసెంబర్ నెల తనకు యానిమల్ విషయంలో కలిసి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube