హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సీఆర్పీఎఫ్ ఐజీ లడ్డా నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సీఆర్పీఎఫ్ ఐజీ లడ్డాకు సెక్యూరిటీగా పని చేస్తున్న జవాన్ దేవేంద్ర కుమార్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం చెందాడు.అయితే ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడమేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.