హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాలు చేయగలిగితే సాయం చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు.సహాయక చర్యల కోసం మీ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వాలని చెప్పారు.
అంతేకానీ మున్సిపాలిటీ సిబ్బంది మానసిక స్థైర్యం దెబ్బతినేలా చిల్లర విమర్శలు చేయొద్దని తెలిపారు.ఎన్నికలకు చాలా సమయం ఉందన్న కేటీఆర్ రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయకండని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.అన్ని సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్న కేటీఆర్ అవసరమైతే ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వెల్లడించారు.