గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది.ఈ నేపథ్యంలో కూలర్లు, ఏసీలు లేకుండా జనాలు బతకలేకపోతున్నారు.
అయితే హర్యానాకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శివదర్శన్ భవిష్యత్తులో ఏసీల అవసరాన్ని తొలగించే పర్యావరణ హితమైన ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు.అదే ఆవు-పేడ ప్లాస్టర్లు, వేప ఇటుకలు తయారు చేయడం.
ఇవి ఇంటిని 7 డిగ్రీల చల్లగా ఉంచగలవు.ఈ ఆవిష్కరణతోనే డాక్టర్ సంవత్సరానికి రూ.10 లక్షలు సంపాదిస్తున్నారు.ఈ డాక్టర్ ఆవిష్కరణలకు సంబంధించిన ఒక వీడియో కూడా ట్విట్టర్‌లో ఇప్పుడు వైరల్‌గా మారింది.
దీనిని చూసి నెటిజన్లు సూపర్ సొల్యూషన్ కనిపెట్టారని పొగుడుతున్నారు.
నార్వే మాజీ క్లైమేట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ మంత్రి ఎరిక్ సోల్హీమ్ ట్విట్టర్‌లో.
“ఆవు పేడ-వేప ప్లాస్టర్ అనేది ప్రొఫెసర్ డా.శివదర్శన్ మాలిక్ ఏటా రూ.10 లక్షలు సంపాదించడంలో సహాయపడుతుంది.ఇతను ఇంటిని 7 డిగ్రీల వరకు చల్లగా ఉంచేందుకు ఆవు పేడ, వేపతో తయారు చేసిన ‘వేద ప్లాస్టర్’ ఇటుకలను ఆవిష్కరించారు.! ” అని పేర్కొన్నారు.
ఆయన ట్వీట్ చేసిన వీడియోకు కొన్ని మిలియన్లకు పైగా వ్యూస్, వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.శివదర్శన్ ఆవు పేడ, మట్టి, అనేక ఇతర సహజ వనరులతో వేద ప్లాస్టర్‌ను అభివృద్ధి చేశారు.వేద ప్లాస్టర్లు ఉన్న ఇళ్ల లోపలి భాగం సిమెంట్-ప్లాస్టర్ చేసిన ఇళ్ల కంటే చల్లగా ఉంటుంది, ఎందుకంటే ఈ ప్లాస్టర్ బయటి నుంచి లోపలకి వేడిని రానివ్వదు.
అప్పుడు ఏసీల వంటివి వాడాల్సిన అవసరం రాదు.ఫలితంగా కరెంటు బిల్లు తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.