యంగ్ డైరెక్టర్లను నమ్మి మోసపోతున్న గోపీచంద్.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ నటుడు గోపీచంద్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.హీరో పాత్రలోనైనా, విలన్ పాత్రలోనైనా అద్భుతంగా నటించి మెప్పించే ప్రతిభ గోపీచంద్ సొంతమనే సంగతి తెలిసిందే.

 Continuous Flops Effect On Gopichand Cine Career Details Here Gopichand , Tollyw-TeluguStop.com

గోపీచంద్ నటించి కొన్నిరోజుల క్రితం విడుదలైన పక్కా కమర్షియల్ సినిమా నిర్మాతలకు కమర్షియల్ గా నష్టాలను మిగిల్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.నిర్మాతలు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిందని చెబుతున్నా థియేట్రికల్ కలెక్షన్ల లెక్కలు మాత్రం ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడిస్తున్నాయి.

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.సినిమాలో పొట్ట చెక్కలయ్యే కామెడీ సీన్లు ఉంటాయని భావించిన ప్రేక్షకులు సైతం ఈ సినిమా అనుకున్న విధంగా లేకపోవడంతో ఫీలయ్యారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆ బ్యానర్ లో మరో ఫ్లాప్ మూవీగా నిలిచింది.అయితే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

అందువల్ల సినిమా ఫ్లాపైనా నిర్మాతలకు నష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉండవని సమాచారం అందుతోంది.గోపీచంద్ కెరీర్ విషయంలో దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వరుసగా గోపీచంద్ సినిమాలు ఫ్లాపైతే మాత్రం కెరీర్ పరంగా గోపీచంద్ నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.గోపీచంద్ కు లౌక్యం తర్వాత ఆ స్థాయి హిట్ అయితే కెరీర్ లో లేదు.

Telugu Flops, Gopichand, Loukyam, Maruthi, Pakka, Srinivas, Tollywood, Young Dir

శ్రీవాస్ డైరెక్షన్ లో లౌక్యం సినిమా తెరకెక్కగా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.గోపీచంద్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో అయినా గోపీచంద్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.యంగ్ డైరెక్టర్లను నమ్మి గోపీచంద్ మోసపోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube