ఈ డివైజ్‌ మీ ఫోన్‌కి కనెక్ట్‌ చేసుకుంటే మీరు కారడవిలో వున్నా సిగ్నల్స్‌ అందుతాయి!

అవును, ఇక్కడ మీరు విన్నది నిజమే.సాధారణంగా మీరు ఎదో ఒకపనిమీద ఒక రిమోట్ ప్రాంతానికి వెళ్లారని అనుకుందాం.

 Connect This Device To Your Phone And Receive Signals Even When You Are In Fores-TeluguStop.com

అక్కడే రోజుల తరబడి ఉండాల్సి వచ్చినపుడు చాలా ఇబ్బందులు పడతారు.ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ ఉండదు.

అలాగని బయటకి కాల్ చేస్తామంటే అక్కడ సిగ్నల్స్ అనేవి పూర్తిగా వుండవు.ఇలా అత్యవసర సమయంలో మనం ఎక్కడున్నామో మనవారికి చెప్పాలంటే చాలా కష్టతరంగా మారవచ్చు.

ఆ ఇబ్బందిని దూరం చేస్తూ మోటరోలా(Motorola ) సంస్థ ‘డిఫై శాటిలైట్‌ లింక్‌(D efy Satellite Link )’ అనే పరికరాన్ని తీసుకువచ్చింది.దీనిని బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుంటే మనం కారడవిలో చిక్కుకున్నా మనవారికి సందేశం అందుతుంది.ఇక్కడ హాట్‌స్పాట్‌ ద్వారా శాటిలైట్‌ సిగ్నల్స్‌ను అందిస్తుంది.అంతేకాకుండా ఈ ప్రత్యేక యాప్‌లో సందేశాలూ పంపుకోవచ్చు.ప్రత్యేకించి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సమాచారం.

ఇక ఇది కావాల్సిన వారు motorolarugged.com అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌ చేసుకొని కొనుక్కోవచ్చు.ఈ వాటర్‌ ప్రూఫ్‌ పరికరాన్ని కీచెయిన్‌గా కూడా మీరు వాడుకొనే వీలుంది.కాగా దీని ధర సుమారు రూ.12,300గా వుంది.అంతేకాకుండా ఇలాంటి గాడ్జెట్స్ చేతి గడియారాల రూపంలో కూడా కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి.

అంటే చేతికి పెట్టుకున్న స్మార్ట్ వాచెస్( Smart watches ) కారణంగా కూడా ఇలాంటి భయానక సమయాలలో సమయస్ఫూర్తితో బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.రోజురోజుకీ మారిపోతున్న కాలం అనేక సమస్యలకు పరిస్కారాలు కనిపెడుతోంది.

ఈ క్రమంలోనే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube