తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి కొవిడ్ వచ్చిందని… త్వరగా కోలుకోవాలని పూజ చేశామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు.శుక్రవారం ఉదయం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి కాంగ్రెస్ నేతలు భట్టి, వీహెచ్, సీతక్క ఇతర ముఖ్య నేతలు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు.సోనియా గాంధీ నిండు నూరేళ్ళు బతకాలని అమ్మవారికి పూజలు చేశామని భట్టి తెలిపారు.తెలంగాణ వ్యాప్తంగా సోనియా గాంధీ కోలుకోవాలని అన్ని మతాలు వారు పూజలు ప్రార్ధన చేయాలని కోరారు.