బస్సు యాత్రకు భారీగా ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ ? 

త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.గతంతో పోలిస్తే కాంగ్రెస్ బాగా బలపడినట్లుగా కనిపిస్తుండడం , ఇతర పార్టీల్లోని నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతుండడం , ఇలా అన్నిటిని లెక్కలు వేసుకుంటోంది .

 Congress Is Planning A Big Bus Trip , Congress, Telangana Congress, Brs Party-TeluguStop.com

అధికార పార్టీ బీ ఆర్ ఎస్ ను ఓడించే స్థాయిలో కాంగ్రెస్( Telangana Congress ) బలపడిందనే విషయాన్ని గుర్తించింది.ఆ జోష్ ఎన్నికల వరకు కొనసాగించేందుకు నిర్ణయించింది.

  క్షేత్రస్థాయిలో జనాలకు దగ్గరయ్యే విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది .  దీనిలో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది .దీంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించి , ఆ తరువాత తెలంగాణ అంతట బస్సు యాత్ర చేపట్టాలని తాజాగా నిర్ణయించుకున్నారు.

Telugu Brs, Congress, Congress Bus, Dk Siva Kumar, Revanth Reddy-Politics

 ప్రస్తుతం అభ్యర్థులు ఎంపికపైనే తీవ్రంగా కసరత్తు జరుగుతుంది.ఈ జాబితాను త్వరలోనే ప్రకటించి ఆ తర్వాత తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లోని నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర చేపట్టేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు.  అదిలాబాద్, పెద్దపల్లి ,నిజామాబాద్ , కరీంనగర్,  మెదక్,  జహీరాబాద్,  చేవెళ్ల,  మల్కాజిగిరి తదితర లోక్ సభ స్థానాలలో ఈ యాత్రకు రూట్ మ్యాప్ ఖరారు అయినట్టు తెలుస్తోంది.

మిగిలిన లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు.ఈనెల మూడో వారంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )బస్సు యాత్రను ప్రారంభించి , రెండు రోజుల పాటు ఈ యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి .అలాగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మూడు,  నాలుగు రోజులు యాత్రలో పాల్గొంటారని,  గ్రామాల్లోనే బస్సు చేస్తారని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ( mallikarjuna kharge )కర్ణాటక సీఎం సిద్దరామయ్య సైతం బస్సు యాత్రలో పాల్గొంటారు అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu Brs, Congress, Congress Bus, Dk Siva Kumar, Revanth Reddy-Politics

 ఇప్పటికే ఈ బస్సు యాత్రకు సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ( DK Siva Kumar )కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు,  పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,  తదితరులు బెంగళూరులో భేటీ అయ్యి బస్సు యాత్ర , అభ్యర్థులు ఎంపిక పైన చర్చించినట్లు సమాచారం.ఈరోజు నుంచి సోమవారం వరకు స్క్రీనింగ్,  వర్కింగ్ కమిటీల్లో ఈ అంశాలపై చర్చించి , అభ్యర్థుల జాబితా బస్సు యాత్ర ( Bus trip )ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube