బస్సు యాత్రకు భారీగా ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ ? 

త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.

గతంతో పోలిస్తే కాంగ్రెస్ బాగా బలపడినట్లుగా కనిపిస్తుండడం , ఇతర పార్టీల్లోని నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతుండడం , ఇలా అన్నిటిని లెక్కలు వేసుకుంటోంది .

అధికార పార్టీ బీ ఆర్ ఎస్ ను ఓడించే స్థాయిలో కాంగ్రెస్( Telangana Congress ) బలపడిందనే విషయాన్ని గుర్తించింది.

ఆ జోష్ ఎన్నికల వరకు కొనసాగించేందుకు నిర్ణయించింది.  క్షేత్రస్థాయిలో జనాలకు దగ్గరయ్యే విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది .

  దీనిలో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది .

దీంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించి , ఆ తరువాత తెలంగాణ అంతట బస్సు యాత్ర చేపట్టాలని తాజాగా నిర్ణయించుకున్నారు.

"""/" /  ప్రస్తుతం అభ్యర్థులు ఎంపికపైనే తీవ్రంగా కసరత్తు జరుగుతుంది.ఈ జాబితాను త్వరలోనే ప్రకటించి ఆ తర్వాత తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లోని నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర చేపట్టేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు.

  అదిలాబాద్, పెద్దపల్లి ,నిజామాబాద్ , కరీంనగర్,  మెదక్,  జహీరాబాద్,  చేవెళ్ల,  మల్కాజిగిరి తదితర లోక్ సభ స్థానాలలో ఈ యాత్రకు రూట్ మ్యాప్ ఖరారు అయినట్టు తెలుస్తోంది.

మిగిలిన లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు.ఈనెల మూడో వారంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )బస్సు యాత్రను ప్రారంభించి , రెండు రోజుల పాటు ఈ యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి .

అలాగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మూడు,  నాలుగు రోజులు యాత్రలో పాల్గొంటారని,  గ్రామాల్లోనే బస్సు చేస్తారని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ( Mallikarjuna Kharge )కర్ణాటక సీఎం సిద్దరామయ్య సైతం బస్సు యాత్రలో పాల్గొంటారు అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

"""/" /  ఇప్పటికే ఈ బస్సు యాత్రకు సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ( DK Siva Kumar )కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు,  పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,  తదితరులు బెంగళూరులో భేటీ అయ్యి బస్సు యాత్ర , అభ్యర్థులు ఎంపిక పైన చర్చించినట్లు సమాచారం.

ఈరోజు నుంచి సోమవారం వరకు స్క్రీనింగ్,  వర్కింగ్ కమిటీల్లో ఈ అంశాలపై చర్చించి , అభ్యర్థుల జాబితా బస్సు యాత్ర ( Bus Trip )ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

.

4 బాదం పప్పులతో ఇలా చేశారంటే మీ ముఖం చంద్రబింబమే!!