కోమటిరెడ్డి పై కాంగ్రెస్ కు నమ్మకం లేదా?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కీలక నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి( Komati Reddy Venkata Reddy ) మరోసారి అలక పాన్పు ఎక్కారు ఆత్మవిశ్వాసం లేని చోట ఎలా పని చేయాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిజానికి మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఏ నేతైన ఆయా పార్టీలలో కీలక స్థానాన్ని అనుభవించి ఉండాలి ఆర్థిక అండదండలతో పాటు సామాజిక మద్దతు, కింది స్థాయి నుంచి పైకి వచ్చిన ఈ నేత తన రాజకీయ ప్రయాణంలో మాత్రం ఒక స్థాయికి మించి ఎదగలేక పోతున్నారు.

 Congress Does Not Believe In Komati Reddy , Komati Reddy, Congress, Manik Thack-TeluguStop.com

నల్గొండ( Nalgonda ) రాజకీయాలపై కీలక పట్టున్నకోమటి రెడ్డి రాష్ట్రస్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ పార్టీ పదవుల విషయంలో వెనుకబడిపోతుండడానికి ప్రధాన కారణం ఈయన నిలకడలేమి అన్నది ప్రధాన ఆరోపణ .ముఖ్యంగా నిలబడాల్సి వచ్చిన చోట పట్టు వదిలేయటం, మద్దతు ఇవ్వాల్సిన చోట వ్యతిరేకించడం ఈయన స్పెషాలిటీ.అంతేకాకుండా ఒకపక్క కాంగ్రెస్ ( Congress )ఎదుగుదలకు ప్రాణం ఇస్తానని చెబుతూనే తమ్ముడు భాజాపాలోకి వెళితే మద్దతు ఇవ్వమని కార్యకర్తలకు ఫోన్లు చేసిన చరిత్ర ఈయనది.

Telugu Congress, Congresskomati, Kc Venugopal, Komati Reddy, Manik Thackeray, Na

దాంతో కీలకమైన కమిటీలలోను ,సమావేశాలలోనూ కాంగ్రెస్ పార్టీ ఈయనను నమ్మకంలోకి తీసుకోలేకపోతున్నట్టుగా తెలుస్తుంది .అత్యున్నత విధాన నిర్ణయాల కమిటీ ఏఐసీసీలో కానీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీలలో కానీ ఈయనకు చోటు ఇవ్వలేదు తన నియోజకవర్గంనుంచి ఉత్తమ కుమార్ రెడ్డి కి స్థానం కల్పించిన అధిష్టానం తనను విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో ఈయన మరోసారి బరస్ట్ అయ్యారు.గుర్తింపులోని చోట పనిచేయలేను అంటూ రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారు.

దాంతో కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపుల పర్వానికి తెరతీసింది.కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జ్ మాణిక్ ఠాక్రే ( Manik Thackeray ) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ( KC Venugopal )తో ఫోన్లో మాట్లాడించినట్టుగా తెలుస్తుంది.

నిన్న కాక మొన్న వచ్చిన నేతలకు కూడా కమిటీల్లో అవకాశం ఇస్తున్నారని, తనను మాత్రం దూరం పెడుతున్నారని తన సీనియార్టీని కూడా పక్కన పెడుతున్నప్పుడు తాను ఎందుకు పార్టీ కోసం కష్టపడాలంటూ ఆయన వారిని నిలదీసినట్టే తెలుస్తుంది.మరి ఈ తిరుగుబాటుతోనైనా ఈయనకు కమిటీలలో స్నానం దక్కుతుందేమో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube