ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలనీ నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.దీంతో వైయస్సార్ షర్మిల( YS Sharmila ) తనకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం పై పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తనపై పెట్టుకున్న నమ్మకానికి పూర్తి నిబద్ధతతో చిత్తశుద్ధితో విధేయతతో పనిచేసే కాంగ్రెస్ పార్టీ( Congress party )కి పునర్వైభవం తీసుకొస్తానని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో కలిసి చేయి చేయి కలిపి పని చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు( Gidugu Rudra Raju ) గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలు అందరి మద్దతును కోరుకుంటున్నాను.వారి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తాను అని షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కూడా స్పందించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిలకి శుభాకాంక్షలు మరియు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో ఏపీలో వైఎస్ షర్మిలకి కాంగ్రెస్ పెద్దలు అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పజెప్పటం.సంచలనంగా మారింది.