గృహ నిర్మాణశాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..!

ఏపీలోని గృహ నిర్మాణశాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 Cm Jagan's Instructions To The Officials Of The Housing Department..!-TeluguStop.com

అదేవిధంగా కాలనీల్లో మౌలిక సదుపాయాలపై అధికారులు పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని సీఎం జగన్ తెలిపారు.ఈ క్రమంలోనే ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఇంటికి తగిన సదుపాయాలు ఉన్నాయా? లేదా ? అన్న దానిపై ఆడిట్ నిర్వహించాలని సూచించారు.ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటివరకు 12,72,143 మంది అక్కాచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు.ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బుల విడుదలకు సన్నద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం జగన్ లబ్దిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పని చేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube