రాజకీయాలకు నేను అర్హుడిని కాదు.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవి( Chiranjeevi ) రాజకీయాలలోకి కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇలా రాజకీయాలలోకి వచ్చినటువంటి ఈయన ప్రజారాజ్యం పార్టీ( Prajarajyam Party ) ని స్థాపించారు.

 Chiranjeevi Sensational Comments On Politics And Movies Details, Chiranjeevi, Po-TeluguStop.com

తొమ్మిది సంవత్సరాలపాటు రాజకీయాలలో కొనసాగినటువంటి చిరంజీవి తిరిగి రాజకీయాల కు( Politics ) దూరం అవుతూ సినిమా ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.

Telugu Chiranjeevi, Prajarajyam, Tollywood, Trisha, Vishwambhara-Movie

ఇకపోతే తాజాగా సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్( South Indian Film Festival ) కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిరంజీవి తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు.నేను బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ప్రజా సేవ చేశాను.అయితే రాజకీయాలలోకి వస్తే మరింత సేవ చేయవచ్చన్న ఉద్దేశంతోనే రాజకీయాలలోకి అడుగు పెట్టానని తెలిపారు.కాని సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదని తాను గ్రహించానని పొరపాటున రాజకీయాలలోకి తొందరపడి వెళ్లాలని ఈయన తెలిపారు.

Telugu Chiranjeevi, Prajarajyam, Tollywood, Trisha, Vishwambhara-Movie

నేటి రాజకీయాలకు నేను అనర్హుడని తెలుసుకున్నాను అందుకే తిరిగి సినిమాలలోకి వచ్చానని తెలిపారు.రాజకీయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అభిమానుల నుంచి అదే ఆదరణ, ప్రేమ ఉంటుందా అని సందేహ పడ్డాను.కానీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే ఆదరణ ప్రేమ చూపిస్తూ వచ్చారని అందుకే ఇకపై తనకు ఓపిక ఉన్నంతకాలం సినిమాలలోనే నటిస్తాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఈయన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర( Vishwambhara ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు కాబోతోంది ఇందులో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube