Chiranjeevi: టాప్ లో చిరంజీవి.. బాటమ్ లో ఆ హీరోస్.. ఏకీపారేస్తున్న ఫ్యాన్స్?

మామూలుగా ఏ స్టార్ హీరో అభిమాని అయిన తమ అభిమాన హీరో హైలో ఉండాలని.ఏ హీరో కూడా తమ హీరోకి పోటీ రాకూడదని అనుకుంటారు.

 Chiranjeevi In The Top Those Heroes In The Bottom Netizens Trolling-TeluguStop.com

కానీ కొన్ని కొన్ని సార్లు అభిమానం ఎక్కువై తమ హీరో ఒక లెవెల్ లో తక్కువ ఉన్నప్పటికీ కూడా అందరికంటే పైకి ఎత్తుతూ ఉంటారు.ఇది వాళ్లకేమి అనిపించదు కానీ చూసే వాళ్లకు మాత్రం బాగా అతిగా ఉంటుంది.

ముఖ్యంగా ఇతర హీరోల అభిమానులకు మాత్రం మండే విధంగా ఉంటుంది.అయితే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్( Chiranjeevi Fans ) చేసిన పనికి మిగతా హీరోల అభిమానులు ఓ రేంజ్ లో ఏకీపారేస్తున్నారు.

అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మామూలుగా ఇప్పుడున్న సీనియర్ హీరోలలో చిరంజీవి, బాలయ్య టాప్ లో ఉన్నారు.

కానీ వీరి కంటే ఎక్కువ పారితోషకం తీసుకొని పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న కుర్ర హీరోలు కూడా ఉన్నారు.అయితే చిరంజీవి,( Chiranjeevi ) బాలయ్య( Balakrishna ) మూడు దశాబ్దాలకు పైగానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఈ వయసులో కూడా వాళ్ళు కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

కానీ ఎవరి స్టామినా వాళ్ళదని చెప్పాలి.

వీళ్ళు సీనియర్ హీరోలు అయినప్పటికీ కూడా వీళ్ళ మీద బాగా రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటారు మిగతా హీరోలు.అంతేకాదు ప్రేక్షకులు కూడా రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటారు.

అయితే బాలయ్య సినిమాల విషయానికి వస్తే అయినా కొత్త కొత్త కంటెంట్లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.కానీ చిరంజీవి మాత్రం అన్ని రీమేక్ సినిమాలే.

దీంతో ఆయనకు రీమేక్ స్టార్ అని ఒక ట్యాగ్ జత చేశారు ప్రేక్షకులు.

ఏదో ఒక రెండు సినిమాలు రీమేక్ చేస్తే ఓకే కానీ.ప్రతి సినిమా రీమేక్( Remake Movies ) చేసుకుంటూ పోతే చూసే జనాలకు కూడా చిరాకు ఉంటుంది.ప్రజెంట్ అయితే చిరంజీవి విషయంలో తన ఫాన్స్ కూడా బాగా నిరాశ చెందుతున్నారు.

రీసెంట్గా ఆయన నటించిన బోళా శంకర్( Bhola Shankar ) కూడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.అప్పటికీ ప్రేక్షకులు రీమేక్ సినిమాలు వద్దు అని ఎంత చెప్పుకొచ్చినా కూడా చిరంజీవి మాత్రం వినలేదు.

కట్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంది.కానీ ఆయన వీరాభిమానులు మాత్రం ఆయనను మరింత తలకెక్కించుకుంటున్నారు.ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో టాప్ పొజిషన్ కి ఎత్తేస్తున్నారు.అంతేకాదు తన వారసులను కూడా టాప్ పొజిషన్ లో ఉండేలాగా చేస్తున్నారు.

అయితే తాజాగా ట్విట్టర్లో ఒక ఒక మెగా వీరాభిమాని.ఒక ఫోటో పంచుకున్నారు.

అయితే అందులో సింహాసనం కుర్చీలో చిరంజీవిని కూర్చోబెట్టగా.ఆయన పక్కన కాస్త పొజిషన్ తగ్గించి పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) రామ్ చరణ్ ను( Ram Charan ) సెట్ చేశారు.

అయితే కింద మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళు సింహాసనం మీద వ్యక్తికి దండాలు పెడుతున్నట్లుగా కొన్ని ఫోటోలు ఉండటంతో.వారి స్థానంలో స్టార్ హీరోలైన బాలయ్య, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, నాగార్జున ఇలా కొంతమంది హీరోల పేర్లను పెట్టగా ఈ హీరోలకు చిరంజీవి నాయకుడు అన్నట్లుగా క్రియేట్ చేశారు చిరంజీవి వీరాభిమాని.అంతే కాకుండా 1978 నుంచి చిరంజీవి పొజిషన్ అదే అన్నట్లు క్రియేట్ చేశారు.

దీంతో మిగతా హీరోల అభిమానులు ఓ రేంజ్ లో ఏకీపారేస్తున్నారు.

అసలు 1978లో రామ్ చరణ్ ఏ సినిమా చేశాడో చెప్పండ్రా అంటూ గట్టిగా అడిగేసారు.మరి కొంతమంది రీమేక్ సినిమాలు చేయటంలో టాప్ పొజిషన్లో ఉన్నాడు కదా అంటూ తిరిగి మెగా అభిమానులకు కౌంటర్ వేసే విధంగా కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి అందరి హీరోల అభిమానులు చిరంజీవి ఫ్యాన్స్ ను ఏకిపారేయటమే కాకుండా చిరంజీవిపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube