ఏలూరు జిల్లాలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య ఘటనపై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో దిశా చట్టం పేరుకే తప్ప ఏం ఉపయోగం లేదన్నారు.
పెదవేగి మండలం వేగివాడ గ్రామంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కేసులో పోలీసులే ప్రధాన నిందితులని ఆరోపించారు.తన మైనర్ కూతుర్ని చిట్టిబాబు అనే వ్యక్తి తీసుకెళ్లాడని తల్లి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని.
పైగా తన కూతుర్ని తానే వెతుక్కోవాలని ఎస్సై దురుసుగా వ్యవహరించారని విమర్శించారు.మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన చర్యలు ఎందుకు తీసుకోలేదని చింతమనేని ప్రశ్నించారు.
తల్లీకూతుళ్ల ఆత్మహత్య చేసుకున్న తర్వాత హడావుడిగా కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్న ఆయన.ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.