కోవిడ్‌తో రెండేళ్లుగా స్వదేశంలోనే.. భారత విద్యార్ధులకు తీపికబురు, వెనక్కి పిలుస్తామన్న చైనా

విదేశాల్లో మెడికల్ కోర్సు చదవాలని మనదేశంలోని యువత కల.అక్కడ డాక్టర్ విద్యను పూర్తి చేసి స్వదేశంలో ప్రాక్టీస్ ప్రారంభించాలని భావిస్తుంటారు.

 China Tells India Working On ‘early Return’ Of Medical Students , Chinese Em-TeluguStop.com

అందుకే చాలామంది భారతీయ విద్యార్థులు స్వదేశంలో కంటే విదేశాల్లోనే వైద్య విద్య కోసం పరుగులు పెడుతుంటారు.ఈ కోవలో చైనాలో పెద్ద సంఖ్యలో మనదేశ విద్యార్ధులు ఎంబీబీఎస్ అభ్యసిస్తున్నారు.

భారత్‌లో ఎంబీబీఎస్ సీటు పొందడం కష్టంతో కూడుకున్న పని, ఖర్చు కూడా ఎక్కువే.దీంతో మెడిసిన్ చదవాలని భావించే వారు తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో చైనా లాంటి దేశాల వైపు చూస్తున్నారు.

కాస్త ఖర్చు పెడితే చాలు అత్యాధునిక వసతులు, ల్యాబోరేటరీలు, అద్భుతమైన ఫ్యాకల్టీ సాయంతో చైనాలో వైద్య విద్యను పూర్తి చేయొచ్చు.

అయితే కోవిడ్ మహమ్మారి ఇలాంటి వారి ఆశలపై నీళ్లు చల్లింది.

వైరస్ వెలుగు చూసిన తర్వాత విదేశీ విద్యార్ధులు తమ దేశంలో అడుగుపెట్టేందుకు చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.దీనిపై భారత్ పలుమార్లు దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ డ్రాగన్ మాత్రం కనికరించడం లేదు.

ఈ పరిణామాల కారణంగా దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్ధులు రెండేళ్లుగా ఇళ్లలోనే మగ్గుతున్నారు.ఇది వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లుగా వారు ఆన్‌లైన్‌ క్లాసులతో నెట్టుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.వీలైనంత త్వరగా భారతీయ విద్యార్ధులను తమ దేశంలోకి అనుమతించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది.ఇది రాజకీయ సమస్య కాదని, వారిపై ఏ విధమైన వివక్షా చూపమని హామీ ఇచ్చింది.

ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ.స్థానిక భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది.విదేశీ విద్యార్థులందరి సంక్షేమం గురించి పట్టించుకుంటామని పేర్కొంది.చైనా ప్రకటన నేపథ్యంలో విద్యార్థులు మరింత సమాచారం కోసం ఢిల్లీలోని చైనా ఎంబసీ, ముంబయి, కోల్‌కతాలోని కాన్సులేట్‌లతో టచ్‌లో ఉండాలి అని భారత రాయబార కార్యాలయం సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube