కార్ కొనాలనుకుంటున్నారా? ఈ 12 కార్లపై భారీ డిస్కౌంట్లు వున్నాయి చూడండి!

ఈ రోజుల్లో కారు కొనడం అనేది ప్రతి మధ్యతరగతి వాడి కల.అయితే కావాలనుకునే కార్ల రేట్స్ వారిని కాస్త వెనక్కి లాగుతుంటాయి.

 Checkout Huge Discounts On These 12 Cars Models Hyundi Mahindra Maruti Cars Deta-TeluguStop.com

అయితే అలాంటివారు భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులోకి వచ్చినపుడు గుర్తించి కొనుగోలు నిర్వహిస్తూ వుంటారు.ఈ డిసెంబర్ నెలలో పలు కంపెనీలు వివిధ మోడళ్లపై అదిరే ఆఫర్లు ప్రకటించాయనే విషయం ఎంతమందికి తెలుసు? మారుతీ సుజుకీ నుంచి టాటా మోటార్స్ వరకు పలు కంపెనీల కార్లపై భారీ డిస్కౌంట్లు పొందొచ్చు.

జీప్ మెరిడియన్ మోడల్ కారుపై రూ.2.5 లక్షల వరకు ఇపుడు తగ్గింపు ఉంది.ప్రీమియం ఫీచర్లతో కారు కొనుగోలు చేయాలని అనుకున్నవారు ఈ కారును చూడవచ్చు.అలాగే జీప్ కంపాస్ కారుపై కూడా రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ వుంది.క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు వంటివి ఇందులో కలిసి వుంటాయని గుర్తించుకోవాలి.

ఫోక్స్‌వ్యాగన్ తైగూన్ కారుపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.కంపెనీకి చెందిన తొలి SUV ఇది.ఈ కారుపై రూ.లక్ష వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్‌పై రూ.75 వేల వరకు తగ్గింపు వుంది.అలాగే హోండా WRV కారు పై కూడా రూ.75 వేల వరకు తగ్గింపు ఉంది.తరువాత హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై కూడా రూ.75 వేల వరకు తగ్గింపు వుంది.మారుతీలో చూసుకుంటే సుజుకీ ఎస్‌ప్రెసో కారుపై మంచి ఆఫర్లు ఉన్నాయి.రూ.75 వేల వరకు ఇందులో కూడా తగ్గింపు సంపాదించవచ్చు.అలాగే మారుతీ సుజుకీ సెలెరియో కారుపై కూడా రూ.75 వేల వరకు బెనిఫిట్ పొందొచ్చు.ఇంకా చివరగా గ్రాండ్ i10 నియోస్ టర్బో కారుపై రూ.లక్ష వరకు డిస్కౌంట్ పొందొచ్చు.కాబట్టి మీమీ టేస్టుకు తగ్గట్టు వాహనం ఇపుడే కొనుగోలు చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube