టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఛార్మి గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో, అందంతో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
ఒకప్పుడు హీరోయిన్ గా నటించగా గత కొన్ని రోజులుగా ఆ స్థానాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.తను చిన్న వయసులోనే హీరోయిన్ గా అడుగుపెట్టగా.
అలా 2001లో నీ తోడు కావాలి అనే సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించింది.తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాలో నటించింది.
ఈ సినిమాలో తన అందాలను కూడా ఆరబోసింది.ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
ఆ తర్వాత మాస్, చక్రం, పౌర్ణమి, రాఖి, జ్యోతిలక్ష్మి, మంత్ర వంటి పలు సినిమాలలో నటించి మంచి హిట్ ను అందుకుంది.ఇక జ్యోతిలక్ష్మి సినిమా( Jyothilakshmi movie ) తర్వాత సినిమాలకు దూరం అయింది.
అది కూడా హీరోయిన్ గా మాత్రమే.జ్యోతిలక్ష్మి సినిమా సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్( Director Puri Jagannath ) తో పరిచయం ఏర్పడింది.దాంతో తను ఆయన సహాయంతో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.అలా పూరి జగన్నాథ్ రూపొందించే ప్రతి ఒక్క సినిమాలకు తానే నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
గతంలో వీరిద్దరి సన్నిహితం చూసి టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో బాగా గుసగుసలు కూడా వినిపించాయి.కానీ వీరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని తామే స్వయంగా తెలిపారు.
కానీ వారిద్దరి మధ్య క్లోజ్ చూస్తుంటే మాత్రం ఇద్దరు సీక్రెట్ గా ఎఫైర్ నడిపిస్తారని అనుమానాలు రాక తప్పదు.
ఇక ఛార్మి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా సినిమా అప్ డేట్ లను కూడా బాగా షేర్ చేస్తుంది.
అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో చిల్ చేసిన ఫోటోలను కూడా తెగ పంచుకుంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.మహేష్ బాబు, కాజల్ అగర్వాల్( Mahesh Babu ,Kajal Aggarwal ) ఇందులో అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు.అయితే రీ రిలీజ్ కి సంబంధించిన థియేటర్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే మధ్యలో ఒక సీన్ లో డైరెక్టర్ పూరి క్యాబ్ డ్రైవర్ గా నటించిన సంగతి తెలిసిందే.
అయితే థియేటర్లో పూరి సీన్ రావటంతో జనాలు పేపర్లు ఎగిరేస్తూ తెగ రచ్చ రచ్చ చేశారు.దానికి సంబంధించిన వీడియోను ఛార్మి కూడా తన ఇన్ స్టాలో స్టోరీ రూపంలో పంచుకుంది.
దీంతో ఆమె స్టోరీ చూసి జనాలు మరింత అనుమానం పడుతున్నారు.నీకు పూరి మీద అంత ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ వీడియో కూడా షేర్ చేసుకున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరి కొంతమంది తన సపోర్ట్ పెంచుకోవడం కోసం తన మనసు గెలుచుకోవడం కోసం అలా వీడియో పెట్టావు కదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.