ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ చేయడం మన ఇండియన్ సినీ ఇండస్ట్రీలలో అలవాటే.ఇదే అలవాటుగా కొన్నేళ్లుగా సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ ను( Sequel Movies ) తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
మరి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి.అయితే మొదటి పార్ట్ కు వచ్చినంత స్పందన తర్వాత సీక్వెల్స్ కు రాదు.
కానీ కొన్ని సినిమాల సీక్వెల్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.చాలా సినిమాల సీక్వెల్స్ భారీ హైప్ తో రిలీజ్ అయినప్పటికీ హిట్ అయిన సందర్భాలు తక్కువ.
ఇదే నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీలో మరో సీక్వెల్ తెరకెక్కుతుంది.ఈ సీక్వెల్ లో ‘చంద్రముఖి 2’( Chandramukhi 2 ) ఒకటి.
మన సౌత్ లో చంద్రముఖి సినిమా అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు.
రజనీకాంత్( Rajinikanth ) కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.2005లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.మరి ఇప్పుడు ఇదే బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది.
పి వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్( Raghava Lawrence ) హీరోగా చంద్రముఖి 2 తెరకెక్కుతుంది.కంగనా రనౌత్( Kangana Ranaut ) హీరోయిన్ గా నటిస్తుంది.
దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.
ఇక వినాయక చవితి( Vinayaka Chavithi ) కానుకగా ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్టిబ్యూషన్ పై అఫిషియల్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమాను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్( Radhakrishna Entertainments ) వారు భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.కాగా లైకా ప్రొడక్షన్స్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.