59మంది ఎన్నారై లపై కేసులు నమోదు..కేంద్రం సంచలన నిర్ణయం...!!!

ఏ తల్లితండ్రులైన వారి పిల్లల్లు సంతోషంగా ఉండాలి, వారు పడిన కష్టం తమ పిల్లలు పడకూడదు అనుకుంటారు.అది కూడా వేరే ఇంటికి పంపే కూతురి విషయం లో వారి జాగ్రత్త మరింత పెరుగుతుంది.

 Centralgovt Marriages Indian Husband-TeluguStop.com

చాల మంది తల్లి తండ్రులు వారి కూతురు విదేశాలలో ఉంటే సంతోషంగా ఉంటుంది, మెరుగైన జీవితాన్ని అనుభవిస్తుందని ఎన్నారై సంబంధాల వెనక పరుగులు తీసేవారు ఇదివరకటి రోజుల్లో.వారి స్థాయిని మరిచి

మరీ పెళ్ళిచేసి పంపేవారు.

కానీ అక్కడకి వెళ్ళాక వారి ఆశలు మొత్తం అడియాశలు అయ్యేవి.కొంతమంది ఎన్నారై ల ధనదాహనికి ఎంతోమంది భారత మహిళల జీవితాలు బలయ్యేవి.అదనపు కట్నం కోసం వేధించేవారు.కొంతమంది అయితే, గొంతెమ్మ కోర్కెలతో అమ్మాయిలని, వారి తల్లితండ్రులని ఇబ్బంది పెట్టేవారు.

ఈ క్రమం లో దిక్కుతోచని మహిళలు ఆత్మహత్య లు చేసుకున్న సందర్భాలు అనేకం.ఇలాంటి శాడిస్టు ఎన్నారై భర్తల పని పట్టడం కోసమే భారత ప్రభుత్వం కొత్త విభాగాన్ని ప్రారంభించింది.

Telugu Nri, Nri Husbend, Telugu Nri Ups-

దీనిని ఎన్నారై మహిళా భద్రత కేంద్రం అంటారు.దీని ద్వార హింసకు గురి అయ్యే మహిళలను రక్షించి, అలాంటి అరాచకాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి 5 కేసులకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకొని, వారి వీసాలను కూడా రద్దు చేశారు.ఇంతకు ముందు ఉన్న రెడ్ కార్నెర్ ద్వార కేసు నమోదు చేసిన కూడా, అక్కడి చట్టాలను అడ్డుపెట్టుక్కొని కేసుల నుంచి తప్పించుకునేవారు.

కాని ఇక అలా జరగదని స్పష్టం చేస్తోంది ఈ విభాగం.ప్రస్తుతం 59 కేసులను దర్యాప్తు చేస్తున్నారు.మిగతా కేసుల్లోని వివరాలు కూడా పరిశీలించి,తప్పు చేసిన వారి వీసాలు రద్దు చేయించి ఇండియా కి రప్పించటానికి ఈ విభాగం ఎంతో ఉపయోగపడుతుంది.దీని ద్వార సత్వర న్యాయం జరుగుతోంది అని ఆడపిల్లల తల్లి తండ్రులు చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube