ఏపీ టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.రైతులకు తెలియకుండా వారి పేర్లపై వైసీపీ నేతలు రుణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
సహకార రంగంలో రూ.5 వేల కోట్ల దోపిడీపై సీబీఐ విచారణ చేయాలని కన్నా డిమాండ్ చేశారు.రైతులు భూ డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో రుణాలు తీసుకుంటున్నారని, వైసీపీ నేతలు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.కుంభకోణంలో సీఎం నుంచి కింది స్థాయి వైసీపీ నేతల వరకు వాటాలున్నాయన్నారు.
కొందరు అధికారులు కూడా కుంభకోణంలో పాత్రధారులని ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో సహకార రంగంలో దోపిడీపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.