దేశవ్యాప్తంగా చాలా మంది హైబీపీతో( high BP ) బాధపడుతున్నారు.అయితే హై బీపీ అన్నది చాలా ప్రమాదకరం.
దీని వలన ఎన్నో ఇతర రోగాలు కూడా సంభవిస్తాయి.ఒక్కొక్కసారి అధిక బీపీ వలన ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా నెలకొంటాయి.
ఇక ఈ రోజుల్లో యువత కూడా ఎక్కువగా హై బీపీ బారిన పడుతున్నారు.దీనినే హైపర్ టెన్షన్( Hypertension ) అని కూడా పిలుస్తారు.
దీన్ని సమయానికి కంట్రోల్ చేయకపోతే గుండెపోటు, కరోనరీ ఆర్టరి డిసీస్( Heart attack, coronary artery disease ) లేదా ట్రిపుల్ స్పెషల్ వెస్సెల్ డిసీస్ లాంటి భయంకర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.అయితే నువ్వుల గింజలతో ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చు.
అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైపర్ టెన్షన్ రోగులు నిత్యము నువ్వులను తీసుకోవడం వలన ఆ సమస్య దూరమై రక్తపోటు అదుపులో ఉంటుంది.అలాగే మార్కెట్లో లభించే ఆహారాలలో కూడా నువ్వులని వాడుతారు.అలాంటి పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి.
అలా తీసుకోవడం వలన రక్తపోటు సమస్య దూరం అవుతుంది.అంతేకాకుండా నువ్వులు( Sesame seeds ) ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
అందుకే నువ్వులను తీసుకోవడం చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తాయి.అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యను తొలగించడంలో నువ్వులు బాగా సహాయపడతాయి.
నువ్వులు మాత్రమే కాకుండా నువ్వులతో చేసే ఏ వంటకమైనా మంచిదే.ఇక మనం రోజు తీసుకునే ఆహారంలో నువ్వులని భాగం చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.నువ్వులను తీసుకోవడం వలన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే అధిక బరువు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.ఆరోగ్యకరమైన ఆహారంలో నువ్వులను మిక్స్ చేస్తే అధిక రక్తపోటు సమస్య కూడా దూరం అవుతుంది.ఇక హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వారు సాధారణ వంట నూనెకు బదులుగా నువ్వుల నూనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది.
ఈ నూనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే ఇందులో ఉండే పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.