ప్రస్తుత వర్షాకాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు తరచూ వేధిస్తూనే ఉంటాయి.వీటి నుంచి బయట పడేందుకు రకరకాల మందులు వాడుతూ తెగ విసికిపోతుంటారు.
అయితే దగ్గు, జలుబు సమస్యలను సూపర్ ఫాస్ట్‌గా నివారించడంలో శంఖ పుష్పం అద్భుతంగా సహాయపడుతుంది.ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉండే శంఖు పువ్వులను చాలా మంది అలంకరణకు వాడుతుంటారు.
కానీ, ఆరోగ్యం పరంగానూ ఇవి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా శంఖు పుష్పాలతో టీ తయారు చేసుకుని తీసుకుంటే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.
మరి లేటెందుకు శంఖు పుష్పాలతో టీ ఎలా తయారు చేయాలి.? ఆ టీ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
కాస్త హీట్ అయ్యాక అందులో రెండు శంఖు పుష్పాలు, దంచిన చిన్న అల్లం ముక్కు, అర స్పూన్ సోంపు మరియు అర స్పూన్ బెల్లం వేసి బాగా మరిగించుకుని ఆపై వడబోసుకుంటే శంఖు పుష్పాల టీ సిద్ధమైనట్టే.

ఈ శంఖు పుష్పాల టీని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఇట్టే తగ్గు ముకం పడతాయి.ఆస్తమా బాధితులు కూడా ఈ టీ సేవించవచ్చు.తద్వారా ఆస్తమా లక్షణాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే సంతాన లేమితో బాధ పడే దంపతులు ప్రతి రోజు ఒక కప్పు శంఖు పుష్పాల టీని తీసుకుంటే గనుక.పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి పెరుగుతుంది.మరియు స్త్రీలలో అండాశయ సమస్యలను దూరమై సంతాన భాగ్యం కలుగుతుంది.
అంతేకాదు, శంఖు పుష్పాల టీని తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ వ్యాధులు తగ్గు ముఖం పడతాయి.
మెదడు చురుగ్గా పని చేస్తుంది.ఆల్జీమర్స్ దరి చేరకుండా ఉంటుంది.
నిద్ర లేమితో ఇబ్బంది పడే వారికి సైతం శంఖు పుష్పాల టీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.రోజూ శంఖు పుష్పాల టీ తాగితే మంచి నిద్ర పడుతుంది.