సాధారణంగా చాలా మంది తాము నల్లగా ఉన్నామని ఎంతగానో వర్రీ అయిపోతుంటారు.ఈ క్రమంలోనే నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే మాత్రం నెల రోజుల్లోనే తెల్లగా మారతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి అన్నది ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు, రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు, రెండు టేబుల్ స్పూన్లు పెసలు, గుప్పెడు ఎండిన మల్లెపూలు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పౌడర్ ను ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో తయారు చేసి పెట్టుకున్న పొడిని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి పసుపు, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మ ఛాయ క్రమంగా మెరుగుపడుతుంది.
అలాగే చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతుంటాయి.దాంతో చర్మం కాంతివంతంగా మరియు షైనీ గా మెరుస్తుంది.
కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించేందుకు ట్రై చేయండి.







