టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.
దత్తపుత్రుడు పార్టీని రౌడీ సేనగా మార్చేశారని విమర్శించారు.గత ఎన్నికల్లో దత్తపుత్రుడిని, సొంత పుత్రుడిని ఓడించి ప్రజలు బైబై చెప్పారన్నారు.
ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారని తెలిపారు.దీంతో చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అని తలలు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు లాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండటం.ఇదేం కర్మరా బాబు అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
గెలిపించకపోతే ఇవి తన చివరి ఎన్నికలు అని చంద్రబాబు చెప్పుకుంటున్నారన్నారు.చివరకు కుప్పంలో కూడా గెలవలేనన్న భయం బాబులో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కుప్పం ప్రజలకు కూడా మేలు చేయలేదని విమర్శించారు.ఓట్లు అడిగేందుకు, చెప్పుకునేందుకు చంద్రబాబు వద్ద ఏమీ లేదన్న జగన్.
రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయం టీడీపీలో కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.







