కడప జిల్లా పులివెందులకు తెలంగాణ సీబీఐ అధికారులు చేరుకున్నారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా వివేకా పీఏ కృష్ణారెడ్డి నివాసానికి సీబీఐ బృందం వెళ్లింది.
రెండు వాహనాల్లో వచ్చిన సీబీఐ అధికారులు కృష్ణారెడ్డి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.అయితే కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ తో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు బెయిల్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే.