ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు సాహసోపేతమైనదని, ఇక దీనిపై ఎలాంటి మార్పులను అనుమతించొద్దని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.
లక్ష్మీనారాయణ అన్నారు.సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం శిరసావహించాలని, ఇప్పటికే ఇచ్చిన బాండ్ల సొమ్ము కూడా పార్టీలు వెంటనే వెనక్కి తిరిగివ్వాలని డిమాండు చేశారు.క్విడ్ ప్రోకోలో భాగంగానే పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తున్నాయని, తాము ఎన్నికల కమిషన్ కు గతంలోనే విన్నవించామని జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో మీడియాకు తెలిపారు.ఇంకా ఎన్నో సంస్కరణలు వస్తేగాని, భారత రాజకీయ వ్యవస్థ రిపేరు కాదని ఆయన పేర్కొన్నారు.