జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు.ఏపీలో మహిళల అదృశ్యంపై పవన్ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు.
అనంతరం మణిపూర్ ఘటనపై పవన్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు.మణిపూర్ ఘటనపై స్పందించి కేంద్రానికి పవన్ సలహాలు ఇవ్వొచ్చు కదా అని నిలదీశారు.
అనంతరం బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని ఉద్దేశిస్తూ రాష్ట్రంలో బీజేపీ స్థానం ఏంటో తెలుసుకోవాలని సూచించారు.ఎవరెన్నీ కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని స్పష్టం చేశారు.