పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాయి ధరం తేజ్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా బ్రో.ఈ సినిమా విషయంలో ముందునుంచి విపరీతమైన బజ్ ఏర్పడింది.
పవన్ సినిమాలకు ఆ మాత్రం క్రేజ్ లేకపోతే ఎలా చెప్పండి.వినోదయ సీతం రీమేక్ గా వస్తున్న బ్రో సినిమాను సముద్రఖని( Samuthirakani ) డైరెక్ట్ చేస్తున్నారు.
కథ తనదే అయినా కథనం, డైలాగ్స్ ఇలా అన్నిట్లో త్రివిక్రం తన పెన్ పవర్ చూపిస్తున్నారు.లేటెస్ట్ గా రిలీజైన బ్రో టీజర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది.
సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సాయి తేజ్( Sai Dharam Tej ) ఆయన శిష్యుడిగా నటిస్తున్నారు.సినిమా టీజర్ చూశాక పవన్ లో ఇదివరకు ఎప్పుడు లేని ఒక ఈజ్ ఈ సినిమాలో కనిపించింది.అదేంటో సీక్రెట్ తెలియదు కానీ బ్రో టీజర్ లో పవన్ తన లుక్స్, స్టైల్, డైలాగ్ డెలివరీతో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు.
ఈమధ్య కాలం లో పవన్ ని ఇంత జోష్ గా ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు.అంతేకాదు వినోదయ సీతం కథను మాత్రమే తీసుకుని తెలుగులో పవన్ ఇమేజ్ కి తగినట్టుగా స్క్రీన్ ప్లే రాసుకున్నారని తెలుస్తుంది.