భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ( British Prime Minister Rishi Sunak )చిక్కుల్లో పడ్డారు.ఆయన ప్రభుత్వం భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై( Infosys ) ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందంటూ ప్రతిపక్ష లేబర్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
రిషి మామగారు , ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణ మూర్తి( Narayana Murthy ) కావడమే ఇందుకు కారణం.బ్రిటన్‌లో ఇన్ఫోసిస్ విస్తరణకు ప్రభుత్వం అదనపు సాయం చేస్తామని హామీ ఇచ్చిందని లేబర్ పార్టీ మండిపడింది.
అసలు వివాదం ఏంటంటే :
గతేడాది ఏప్రిల్‌లో బ్రిటన్ వాణిజ్య మంత్రి లార్డ్ డామినిక్ జాన్సన్( British Trade Minister Lord Dominic Johnson ) భారత్‌లో పర్యటించారు.ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు.ఇన్ఫో ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన డామినిక్.యూకేలో సంస్థ విస్తరణపైనా మంతనాలు జరిపినట్లుగా బ్రిటన్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.లేబర్ పార్టీకి ఈ కథనాలు ఆయుధంలా మారాయి.భారతీయ ఐటీ దిగ్గజంపై రిషి ప్రభుత్వం కనబరుస్తున్న శ్రద్ధ పలు సందేహాలకు తావిస్తోందని లేబర్ పార్టీ నేత జానథన్ పేర్కొన్నారు.
మరోవైపు.లేబర్ పార్టీ( Labor Party ) చేస్తున్న ఆరోపణలపై బ్రిటన్ వాణిజ్య శాఖ సైతం స్పందించింది.
దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు వాణిజ్య మంత్రి భారత్ సహా వివిధ దేశాల్లోని కంపెనీలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశమవుతారని కౌంటర్ ఇచ్చింది.
రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి ( Akshata Murthy )తన తండ్రి నారాయణ మూర్తి ఐటీ కంపెనీలో ఒకప్పుడు 500 మిలియన్ పౌండ్లకు పైగా విలువ చేసే 0.91 శాతం వాటాను కలిగి వున్నారు.గత ఆర్ధిక సంవత్సరంలో ఆమె 13 మిలియన్ పౌండ్ల డివిడెండ్‌లను అందుకుంది.
ఈ గణనీయమైన సంపద సునాక్‌ను యూకే చరిత్రలో అత్యంత సంపన్న ప్రధాన మంత్రిగా పరిగణించబడటానికి దోహదపడింది.యూకేలో 750 మిలియన్ పౌండ్ల విలువైన కాంట్రాక్టుల కోసం ఇన్ఫోసిస్ పోటీపడుతోందని సండే మిర్రర్ నివేదించింది.
గతంలో జీవన వ్యయ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం పన్నులను పెంచింది.దీంతో ప్రతిపక్షాలు రిషి సునాక్‌పై అప్పట్లో ఆరోపణలు చేశాయి.చెబుతున్న ప్రమాణాలను ప్రధాని పాటించడం లేదని, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్న సమయంలో ఇన్ఫోసిస్ కంపెనీలు రష్యాలో పనిచేస్తుండటంపైనా విమర్శలు చేశాయి.ఈ కారణంతో రష్యాలోని ఇన్ఫోసిస్ కార్యాలయాలను మూసివేసిన సంగతి తెలిసిందే.