అవును… ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అని పేరు తెచ్చుకున్నవారు అనతికాలంలోనే ప్లే బాయ్ లుగా పేరు తెచ్చుకున్నారు.వయసేమో అర్ధ సెంచరీ మించిపోతుంది.
అయినా వారి ప్రేమ(ల)కు మాత్రం వయస్సు అయిపోదేమో మరి.లేటు వయసులో కూడా ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు మన బాలీవుడ్ స్టార్లు.అయినా ప్రేమలో పడడానికి వయసుతో పనేముందని అంటారా? అసలు ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని బ్రేకప్ లతో, అంతకుమించి సెన్సేషనల్ రిలేషన్స్ తో లవ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఈమధ్యకాలంలో హాట్ టాపిక్ అవుతున్నారు కొంతమంది.
అవును.
లవ్ లో బాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది.ఒకరి తర్వాత ఒకరు కొత్త కొత్త రిలేషన్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.
ఇందులో ముందుగా బాలీవుడ్ గ్రీకు వీరుడు హ్రితిక్ రోషన్ గురించి మాట్లాడుకోవాలి.హృతిక్ రోషన్, సబా ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
కొన్నాళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్న సబా, హృతిక్ పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ న్యూస్ చక్కెర్లు కొడుతోంది.భార్య సుజానేతో విడాకులు తీసుకున్న హృతిక్ తనకంటే 20 ఏళ్లు చిన్నదైన సబా అజాద్ తో లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ తరువాత మాట్లకుకోవాలంటే, గత రెండు రోజుల క్రితం అన్ ఎక్స్ పెక్టెడ్ లవ్ అనౌన్స్ మెంట్ తో షాకిచ్చింది బాలీవుడ్ సీనియర్ తార సుస్మిత సేన్.లైఫ్ లో దాదాపు ముగ్గురితో డేటింగ్ చేసిన సుస్మితా సేన్ లేటెస్ట్ గా IPL సృష్టికర్త లలిత్ మోదీతో ప్రేమలో సోషల్ మీడియాలో షేక్ చేసింది.లలిత్ కన్నా ముందు తనకన్నా 15 ఏళ్లు చిన్న వాడైన రోహ్మత్ షాల్ తో 4 ఏళ్ళు లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది స్టార్లు పేర్లు బయటకి వస్తాయి.
ఇక లేటెస్ట్ గా కత్రినా కైఫ్ తమ్మడు సెబాస్టియన్ లారెంట్ నటి ఇలియానా లవ్ లో ఉన్నట్టు టాక్ నడుస్తోంది.