ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యత మౌలిక సదుపాయాల కల్పన, కనీస విద్య ,వైద్యం అందుబాటులో ఉంచడం ,పేదలకు ఇండ్ల నిర్మాణం వంటివి ఉంటాయి.అయితే మారిన పరిస్థితులలో చాలా రాజకీయ పార్టీలు( Political Parties ) కేవలం కొన్ని సంక్షేమ పథకాలు,( Social Schemes ) తమ సామాజిక వర్గ ప్రజల మద్దత్తు హామీల పేరుతో ఇచ్చే కొన్ని తాయిలాల తో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి ఇలాంటి తాత్కాలిక ఆశలు చూపించి వచ్చే రాజకీయ పార్టీల మనుగడ కూడా అర్ధాంతరంగానే ముగిసిపోతుంటుంది.
ప్రజాస్వామ్యానికి పునాది వాక్యాలైన “ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే అన్న మౌలిక సూత్రాలను పాటించే రాజకీయ పార్టీలకే దీర్ఘకాల మనుగడ ఉంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుంగనూరు ప్రాంతానికి పారిశ్రామిక వేత్త బోడే రామచంద్ర యాదవ్( Bode Ramachandra Yadav ) అధ్యక్షతన అవతరించిన భారత చైతన్య యువజన పార్టీ( Bharata Chaitanya Yuvajana Party ) ఈ మూలాలు పట్టుకుని ఎదుగుతున్నట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా దేశానికి భవిష్యత్తు యువతే అంటారు.అలాంటి యువత సరైన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేక నిరుత్సాహానికి లోనవుతుందని, ఇతర రాష్ట్రాలకు లేదా గల్ఫ్ లాంటి దేశాలకు కూలీలుగా వలస వెళ్లాల్సిన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో దాదాపు 500 కంపెనీలను ఒప్పించి 50 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా ఈ పార్టీ ప్రయత్నం చేయటం హర్షణీయం.
ప్రజాభిమానాన్ని ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాల ద్వారా పొందాలని ప్రయత్నం చేయటం ఒక నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.అంతేకాకుండా ఈ పార్టీ ప్రకటించిన లక్ష్యాలు గానీ ముందుకెళ్తున్న విధానం కూడా దీర్ఘకాల వ్యూహంతోనే ఉన్నట్లుగా స్పష్టమవుతుంది.ఆవిర్భావంతోనే తమ స్పష్టమైన లక్ష్యాలతో చర్చనీయాంశం గా మారిన ఈ పార్టీ ఒక్కొక్క లక్ష్యాన్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న తీరు మాత్రం ఆసక్తికరం గా ఉందనే చెప్పాలి.సెప్టెంబర్ 2 , 3 తారీకుల్లో ఈ పార్టీ ఘనంగా జరుపుతున్న ఉద్యోగాల సంబరం ఎన్ని కుటుంబాలలో వెలుగులు తీసుకువస్తుందో ఈ పార్టీ భవిష్యత్తు కూడా అంత దేదీప్యమానంగా వెలిగే అవకాశం కనిపిస్తుంది
.