బీజేపీ జెట్ స్పీడ్.. పురందేశ్వరే కారణమా ?

ఏపీలో బీజేపీ రోజు రోజుకు స్పీడ్ పెంచుతోంది.గతంలో లేనంతగా ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తోంది.

 Bjp's Jet Speed Purandeshwar Is The Reason , Daggubati Purandeswari , Somu Ve-TeluguStop.com

దీనికి కారణం ఏపీ బీజేపీ బాద్యతలు చేపట్టిన పురందేశ్వరే( Daggubati Purandeswari ) అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.ఆమె అధ్యక్ష బాద్యతలు చేపట్టిన తరువాత పార్టీలో జోష్ పెరిగింది.

పార్టీలోని కీలక నేతలతో సమావేశాలు నిర్వహించడం, తదుపరి కార్యాచరణపై ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించడం, నేతలందరితోను సత్సంబంధాలు కొనసాగించడం.చేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో బలపరిచే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు పురందేశ్వరి.

గతంలో సోము వీర్రాజు( Somu Veerraju ) అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో పెద్దగా బీజేపీ హైలెట్ అయ్యేది కాదు.ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లో ఆధారణ మాత్రం లభించేది కాదు.

Telugu Bjp, Congress, Janasena, Pawan Kalyan, Somu Veerraju-Latest News - Telugu

అలాగే సోము వీర్రాజు ( Somu Veerraju )వ్యవహార శైలి కూడా పార్టీలోని చాలమంది నేతలకు నచ్చేది కాదనే టాక్ ఎప్పటినుంచో వినిపిస్తోంది.దాంతో ఏపీలో అసలు బీజేపీ ఉందా లేదా అనే డౌట్ వ్యక్తమయ్యేది.కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.ఎవరు ఊహించని విధంగా పార్టీ బాద్యతలు చేపట్టిన పురందేశ్వరి… అన్నీ విషయాల్లోనూ పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.ఇక ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలలే సమయం ఉండడంతో పార్టీని వీలైనంతా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు.పొత్తుల అంశాన్ని అధిష్టానానికి విడిచిపెట్టిన పురందేశ్వరి.

ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ హాట్ టాపిక్ అవుతున్నారు.

Telugu Bjp, Congress, Janasena, Pawan Kalyan, Somu Veerraju-Latest News - Telugu

ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె భావిస్తున్నారు.అందులో భాగంగానే ” నా భూమి నా దేశం ” పేరుతో రేపటి నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రజల్లో ప్రచారం నిరవహించనున్నారు.ఇక పోతే అటు పార్టీలో కూడా చాలమంది కాషాయ నేతలు పురందేశ్వరి నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు.

అటు మిత్రపక్షాలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నఆమె నాయకత్వంలో పార్టీ బలం పెరగడం గ్యారెంటీ అని అధిష్టానం భావిస్తోంది.మరి ప్రస్తుతం సింగిల్ గానే ప్రచారాలు చేస్తున్న కాషాయ పార్టీ ఎన్నికల సమయంలో మిత్రపక్షం జనసేన( JanaSena Party )తో కలిసి ప్రచారాలు నిరవహిస్తుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube