బిగ్ బాస్ షో సీజన్7 గత సీజన్లకు భిన్నంగా ఉండనుందని జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్ తో బిగ్ బాస్ షో సీజన్7 మొదలు కాగా బిగ్ బాస్ సీజన్7 తెలుగు లాంఛ్ ఎపిసోడ్ కు అదిరిపోయే రేటింగ్ వచ్చింది.
బిగ్ బాస్ షో సీజన్7 లాంఛ్ ఎపిసోడ్ ఊహించని రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఈ సీజన్ సంచలనాలకు కేరాఫ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
బుల్లితెరపై ఈ షో 18.1 టీవీఆర్ ను సొంతం చేసుకుంది.ఈ షో లాంఛింగ్ ఎపిసోడ్ ను ఏకంగా 2.9 కోట్ల మంది వీక్షించారట.బిగ్ బాస్ షో సీజన్6 తో పోల్చి చూస్తే బిగ్ బాస్ షో సీజన్7 మెరుగైన రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.గతంలో పలు క్రికెట్ మ్యాచ్ లు క్రియేట్ చేసిన రికార్డ్ లను సైతం బిగ్ బాస్ షో సీజన్7 అధిగమించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గత రెండు సీజన్లతో పోల్చి చూస్తే మెరుగైన కంటెస్టెంట్లను ఎంపిక చేయడం బిగ్ బాస్ షోకు వరమైందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తు ఎపిసోడ్స్ తో బిగ్ బాస్ షో ఏ రేంజ్ లో సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ ఎవరనే చర్చ కూడా జోరుగా జరుగుతుండటం గమనార్హం.బిగ్ బాస్ షో రేటింగ్స్ విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఇతర భాషల బిగ్ బాస్ షోలకు భిన్నంగా తెలుగు బిగ్ బాస్ షో సీజన్7 ఉండగా అదే సమయంలో ఈ షో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.నాగార్జున హోస్టింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ షోకు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షో నాగార్జునకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.