తైవాన్‌ పైన కన్నేసిన చైనా.. తమ భూభాగంలో కలిపేసేందుకు స్కెచ్ విడుదల!

తైవాన్‌ పైన( Taiwan ) ఎన్నో యేళ్లుగా కన్నేసిన చైనా( China ) ఎట్టకేలకు ఎలాగైనా ఆక్రమించేందుకు కుయుక్తులు పన్నుతోంది.ఈ ద్వీపం తమ దేశంలోని భాగమేనని వాదిస్తున్న డ్రాగన్‌ కంట్రీ తాజాగా దీన్ని తమ భూభాగంలో విలీనం చేసుకొనేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేసి మరీ బాహాటంగానే ఆవిష్కరించింది.

 China Strategic Blueprint For Integrating Fujian Province And Taiwan Details, Ch-TeluguStop.com

బ్లూప్రింట్‌ను విడుదల చేయడానికి ముందు.తైవాన్‌ను బెదిరించేందుకు ఆ ద్వీపం దిశగా చైనా యుద్ధనౌకలను కూడా పంపడం కొసమెరుపు.

చైనాలో తీర ప్రావిన్స్‌ ఫుజియాన్‌, తైవాన్‌ మధ్య జలసంధుల పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే విధంగా డ్రాగన్‌ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించింది.

Telugu America, Canada, China, China Taiwan, China Blueprint, China War Ships, F

తైవాన్‌ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూప్రింట్‌గా చెబుతున్న ఈ ప్లాన్‌ చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ విడుదల చేయడం గమనార్హం.తైవాన్‌తో సమగ్ర అభివృద్ధికి ఫుజియాన్‌ను ‘ప్రత్యేక జోన్‌’గా( Special Zone ) మార్చడంతో పాటు తైవాన్‌ నివాసితులు చైనాలో స్థిరపడేందుకు, ఇక్కడ వ్యాపారాలు కూడా చేసేందుకు వీలుగా ఫుజియాన్‌ను( Fujian ) ‘ఫస్ట్‌ హోం’గా పేర్కొంటూ ఈ ప్రణాళికను ఆవిష్కరించినట్లు డ్రాగన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

Telugu America, Canada, China, China Taiwan, China Blueprint, China War Ships, F

అయితే, తైవాన్‌ చుట్టూ యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ.చైనా ఈ బ్లూప్రింట్‌ను బయట పెట్టడం ఇపుడు అంతర్జాతీయంగా ఈ వార్త చర్చనీయాంశం అవుతోంది.గత వారాంతంలో అమెరికా, కెనడాలకు చెందిన యుద్ధనౌకలు తైవాన్‌ జలసంధిలో ప్రయాణించి చైనా దుందుడుకు చర్యలను సవాలు చేయడం అందరికీ తెలిసినదే.

దీంతో ఆగ్రహించిన డ్రాగన్‌ .సోమవారం తన యుద్ధనౌకల దండును తైవాన్‌ జలసంధిలోకి పంపించింది.సైన్యం ఇక్కడ యుద్ధవిమానాలు, జలాంతర్గాముల సన్నద్ధత, ఇతర యుద్ధ విన్యాసాలను చేపడుతుందని చైనా మీడియా వెల్లడించింది.మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సమయంలో చైనా కొత్త బ్లూప్రింట్‌ను ఆవిష్కరించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube