ముమైత్ ఖాన్ కు అలాంటి కష్టాలు ఉన్నాయా.. ఆమె ఎలిమినేషన్ బాధాకరమంటూ?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో బుల్లితెరపై ఏ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుందో ఓటీటీలో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.బిగ్ బాస్ షో ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుందని సమాచారం అందుతోంది.

 Bigg Boss Non Stop Mumaith Elimination Was So Sad As She Deep In Financial Crisi-TeluguStop.com

ఈ షో నుంచి తొలివారం అందరూ ఊహించిన విధంగానే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడం గమనార్హం.

Telugu Bigg Boss Show, Disney Hot, Financisal, Magadheera, Mumaith Khan, Pokiri-

గత కొన్నేళ్లలో ముమైత్ ఖాన్ కు సినిమా ఆఫర్లు తగ్గాయి.ముమైత్ ఖాన్ మరికొన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఉంటే ఆర్థికంగా ఆమెకు ప్రయోజనం చేకూరి ఉండేదని ఆమె అభిమానులు భావిస్తున్నారు.వందల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ చేసిన ముమైత్ ఖాన్ కు పోకిరి, మగధీర సినిమాలలోని సాంగ్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఆమె కొన్ని సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో కూడా నటించారు.

తెలుగులో మాట్లాడటం బాగా రాకపోయినా తెలుగు సినిమాల ద్వారానే ముమైత్ ఖాన్ ఫేమస్ అయ్యారు.

ఇతర భాషలలో కూడా సినిమా ఆఫర్లను అందుకుని 2013 సంవత్సరం వరకు ముమైత్ ఖాన్ బిజీగా ఉన్నారు.బిగ్ బాస్ సీజన్1 తెలుగు కంటెస్టెంట్లలో ముమైత్ ఖాన్ కూడా ఒకరు.

బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన సమయంలో డ్రగ్స్ కేసు ద్వారా ముమైత్ ఖాన్ పేరు వార్తల్లో నిలవడం గమనార్హం.

Telugu Bigg Boss Show, Disney Hot, Financisal, Magadheera, Mumaith Khan, Pokiri-

ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ బాధాకరమని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ముమైత్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని వినిపిస్తోంది.సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత ముమైత్ ఖాన్ పలు ఈవెంట్లలో పాల్గొన్నారని కరోనా విజృంభణ తర్వాత ముమైత్ ఖాన్ కు ఈ ఆదాయం కూడా తగ్గిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube