విశాఖ సీఐ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో బిగ్ ట్విస్ట్

విశాఖపట్నంలోని సీఐ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.విచారణలో భాగంగా పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడి అయ్యాయని తెలుస్తోంది.బాధితులు అయిన రిటైర్డ్ నేవీ అధికారులు తెచ్చింది రూ.90 లక్షలు అయితే రూ.12 లక్షలేనని రిమాండ్ రిపోర్టులో ఉన్నట్లు సమాచారం.కాగా నోట్ల మార్పిడి పేరుతో నేవీ అధికారులను స్వర్ణలత గ్యాంగ్ బెదిరింపులకు గురి చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే స్వర్ణలత, సూరిబాబులకు చెరో రూ.5 లక్షలు, హోంగార్డు శ్రీనివాస్ కు రూ.2 లక్షలు ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రిమాండ్ రిపోర్టులో సైతం రూ.90 లక్షల గురించి ప్రస్తావన లేదు.దీంతో రూ.90 లక్షలు ఎవరివి? ఎక్కడివి అనే దానిపై స్పష్టత కరువైంది.మరోవైపు రూ.12 లక్షలతో కేసు ముగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయని సమాచారం.

 Big Twist In Visakha Ci Note Exchange Case-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube