విత్తన శుద్ధి చేసి పంటలు పండిస్తే ఇన్ని ప్రయోజనాలా..?

వ్యవసాయంలో అధిక దిగుబడి( High Yielding ) పొందాలంటే కీలకం నాణ్యమైన విత్తనాలు.విత్తనాలను( Seeds ) శుద్ధి చేసుకుని విత్తుకోవాలి.

 Increase Crop Yields With Seed Purification Details, Crop Yields , Seed Purific-TeluguStop.com

ఇలా చేస్తే భూమి లోపల ఉండే వివిధ తెగుళ్ళ, చీడపీడల ప్రభావం విత్తనాలపై తక్కువగా ఉంటుంది.భూమిలో గతంలో పంటకు వేసిన అవశేషాలలో వైరస్, బ్యాక్టీరియా లకు సంబంధించిన శిలీంద్రాలు జీవించి ఉంటాయి.

ఇవి విత్తిన విత్తనాలను ఆశించడం వల్ల, వీటి నివారణ కోసం ఎన్నో రకాల రసాయన పిచికారి మందులను ఉపయోగించాల్సి ఉంటుంది.దీంతో పెట్టుబడి భారం అధికం అవుతుంది.

వ్యవసాయంలో నివారణ కంటే నిరోధనే మేలు.విత్తనాలను ఎలా శుద్ధి చేసుకోవాలి.ఎటువంటి విత్తనాలను ఎంచుకొని సాగు చేయాలి అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.

అందులో చాలా వరకు నకిలీ విత్తనాలు( Fake Seeds ) ఉన్నాయనే విషయం రైతులందరికీ తెలిసిందే.కాబట్టి సర్టిఫైడ్ కంపెనీలకు చెందిన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని సాగు చేయాలి.

Telugu Agriculture, Certified Seeds, Crop Yields, Crops, Techniques, Fertilizers

రెండవది ఏ పంట వేసినా ముందుగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరి.విత్తన శుద్ధి ( Seed Purification ) చేస్తే నేల ద్వారా వచ్చే చీడపీడలు, తెగుళ్ల నుంచి పంట సంరక్షించబడుతుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.విత్తన శుద్ధి చేసిన ప్రతి విత్తనం మొలక ఎత్తుతుంది.విత్తన శుద్ధి అనేది విత్తనానికి ఒక రక్షక కవచంలో పనిచేయడం వల్ల మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది.విత్తన శుద్ధి ముందుగా కీటక నాశనం మందులతో చేయాలి.

Telugu Agriculture, Certified Seeds, Crop Yields, Crops, Techniques, Fertilizers

ఆ తర్వాత ఓ గంట పాటు నీడలో ఆరబెట్టి సిలింద్రనాసిని మందులతో శుద్ధిచేసి, చివరగా జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టిన తర్వాత ప్రధాన పంట పొలంలో విత్తుకోవాలి.దీంతో దాదాపుగా రసాయన పిచికారి మందుల అవసరం ఉండదు.తద్వారా మందుల ఖర్చు, కూలీల ఖర్చు ఆదా అవ్వడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube