బిగ్ డే ఫర్ టిడిపి: పలితం దక్కుతుందా ?

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తరువాత ఇప్పటివరకు కోర్టులలో ఆ పార్టీకి అనుకూలమైన తీర్పు ఒక్కటి కూడా రాలేదు.ఇది తెలుగుదేశం లీగల్ టీం వైఫల్యమా లేక ప్రభుత్వ లీగల్ టీం విజయమా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి మాత్రం చాలా నష్టం జరుగుతుందన్నది స్పష్టంగా తెలుస్తుంది.

 Big Day For Tdp , Chandrababu Arrest , Quash Petitio, Nara Lokesh , Supreme Cou-TeluguStop.com

ఎన్నికలకు సమయం దగ్గర పడినందున పార్టీ కీలక కార్యక్రమాలను ముందుండి నడిపించాల్సిన చంద్రబాబు ఇలా జైలుకే పరిమితం అవ్వటం ఆ పార్టీకి చాలా ఇబ్బందులు కలగజేస్తుంది.లోకేష్( Nara lokesh ) కొంత ముందుండి నడిపిస్తున్నప్పటికీ పార్టీ నాయకుడిగా చంద్రబాబు లేని లోటును పూడ్చడం మాత్రం ఏ నాయకుడి వల్లా కాదు మరి అలాంటప్పుడు ఈరోజు మూడు కోర్టులలో ఆరు కేసులకు సంబంధించిన విచారణ జరుగుతుండడం తో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కి బిగ్ డే అని చెప్పవచ్చు .

Telugu Ap Fibernet, Ap, Ap Skill Scam, Lokesh, Quash Petitio, Supreme, Ys Jagan-

ముందుగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ( Quash Petitio )కు సంబంధించిన తీర్పు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తుండగా మరోవైపు ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం( AP Skill Development Scam ) కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ మరియు సిఐడి విచారణకు సంబంధించిన కేసులు విచారణకు రానున్నాయి.మరోవైపు ఏపీ హైకోర్టులో పుంగనూరు అల్లర్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు సంబంధించిన కేసు, ఫైబర్ నెట్ కేసు( AP Fibernet Case ) లో టిడిపి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లపై విచారణ జరగనుంది.ముఖ్యంగా సుప్రీంకోర్టులో కనుక క్వాష్ పిటిషన్ అంగీకరించబడితే తెలుగుదేశానికి అతిపెద్ద రిలీఫ్ గా మారనుంది.అయితే ప్రస్తుతం వినిపిస్తున్న న్యాయ నిపుణుల విశ్లేషణల ప్రకారం ఇప్పటికిప్పుడు టిడిపికి క్వాష్ పిటిషన్ లో రిలీఫ్ దొరకడం కష్టమేనని తెలుస్తుంది.

Telugu Ap Fibernet, Ap, Ap Skill Scam, Lokesh, Quash Petitio, Supreme, Ys Jagan-

అయితే హై హైకోర్టులో బెయిల్ పిటిషన్ లపై తీర్పు అనుకూలంగానే రావచ్చని అయినప్పటికీ చంద్రబాబు బయటకు రావడానికి మాత్రం అనేక అడ్డంకులు, న్యాయ చిక్కులు ఉన్నట్లుగానే తెలుస్తుంది.ఏది ఏమైనా మరో నెల రోజుల సమయంలో చంద్రబాబు బయటకు రాకుంటే మాత్రం రాజకీయ పార్టీగా తెలుగుదేశం అతిపెద్ద ఇబ్బందులు ఎదుర్కోబోతుంది.ఎన్నికల కేంద్రంగా ఆ పార్టీ చాలా వెనకబడిపోతుంది .ఈ దిశగానే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ కూడా సాధ్యమైనంత ఎక్కువ సమయం చంద్రబాబును లోపలే ఉండేలా పావులు కదుపుతుంది .మరి ఏ వర్గం న్యాయస్థానాల్లో అనుకూల ఫలితాలు పొందుతుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube