మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తన లేటెస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్” వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్ వేదాళం అనే సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా తమన్నా( Tamannaah Bhatia ) హీరోయిన్ గా నటించగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటించింది.
ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.అయితే మొదటి షో తోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.కానీ కలెక్షన్స్ పరంగా పూర్తిగా నిరాశ పరిచింది.ఈ సినిమా స్ట్రైట్ సినిమా కాకపోవడంతో ఆశించిన రేంజ్ లో వసూళ్లు రాలేదు అనే చెప్పాలి.దీంతో మెగాస్టార్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం కావడంతో మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి పలు ఊహించని రూమర్స్ వెబ్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.నిర్మాత కూడా పలు స్టేట్మెంట్స్ ఇచ్చారని వైరల్ కాగా ఇప్పుడు దీనిపై తుది క్లారిటీ వచ్చేసింది.భోళా గురించి ఏకే ఎంటెర్టైమెంట్స్ వారు అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.
వారు పోస్ట్ చేస్తూ.భోళా శంకర్( Bhola Shankar ) గురించి ప్రస్తుతం నడుస్తున్న రూమర్స్ కానీ ఫేక్ ప్రచారాలు కానీ ఒక్క పర్సెంట్ కూడా నిజం కాదు అన్ని అబద్ధాలు అని అవన్నీ నిరాధారిత ఆరోపణలు అంటూ వారు చెప్పుకొచ్చారు.
ఈ వార్తలను ఎవ్వరూ నమ్మకండి అంటూ అసలు ఆ మ్యాటర్ కోసం డిస్కర్షన్ కూడా అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.దీంతో ఇప్పటి వరకు భోళాపై వచ్చిన వార్తలన్నీ ఆధారితం లేనివి అంటూ తెలుస్తుంది.