పట్టు వదలని భీష్మ.. రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్‌లో మరో హిట్‌ను నమోదు చేసుకున్నాడు.

 Bheeshma Two Days Collections-TeluguStop.com

వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు.

ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా చూసేందుకు జనం ఎగబడ్డారు.

నితిన్ కామెడీ టైమింగ్, రష్మిక అందాల ఆరబోత, ఆకట్టుకునే కథనం సినిమాకు బాగా కలిసిరావడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవంలో విజయం సాధించింది.ఈ సినిమా తొలిరోజే మంచి కలెక్షన్లు నమోదు చేయగా రెండో రోజు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.10.52 కోట్ల వసూళ్లు సాధించింది.

నితిన్ నటించిన ఈ సినిమాకు ఇంతటి కలెక్షన్లు రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లు ఏరియా వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.10 కోట్లు

సీడెడ్ – 1.52 కోట్లు

నెల్లూరు – 0.37 కోట్లు

కృష్ణా – 0.67 కోట్లు

గుంటూరు – 1.02 కోట్లు

వైజాగ్ – 1.20 కోట్లు

ఈస్ట్ – 0.92 కోట్లు

వెస్ట్ – 0.72 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 10.52 కోట్లు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube