లేగదూడకు బారసాల.. ఊయాలలో ఊపుతూ..!

భారతీయులు ఆవులను, ఎద్దులను పవిత్రంగా భావిస్తుంటారు.దేశంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు.

 Ap, Vijayawada, Barasara, Legaduda-TeluguStop.com

వ్యవసాయానికి ఎద్దులు ఎంతగానో సహకరిస్తే.ఆవులను గోమాతగా పూజిస్తుంటారు.

అయితే చాలా మంది రైతులు తమ పశువులను ఎంతో ప్రేమగా ఆలన పాలన చూసుకుంటారు.వారిని కూడా ఇంట్లో సభ్యులుగానే ట్రీట్ చేస్తుంటారు.

ఆవులకు దూడలు పుడితే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.

అయితే విజయవాడలో ఓ రైతు కుటుంబంలో ఆవుకి పుట్టిన లేగ దూడను బారసాల నిర్వహించారు.

దూడను అందంగా అలకరించి ఊయాలలో ఊపుతూ ఘనంగా బారసాల జరుపుకున్నారు.అయితే ఈ వీడియోను చూసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేశాడు.

భారతీయ సంస్కృతి ఇదంటూ క్యాప్షన్ రాశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషన్ మీడియాలో వైరల్ అవుతుంది.

గత నెల జూన్ లో విజయవాడ వివి నరసరాజు రోడ్డులోని శ్రీ కృష్ణ దేవాలయంలోని గోశాలలో ఆవుకు దూడ జన్మనిచ్చింది.దీంతో ఆలయ కమిటీ సభ్యులు దూడకు ఘనంగా బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆత్మీయుల సమక్షంలో దూడకు లక్ష్మీ అని పేరు పెట్టారు.ఊయాలలో లక్ష్మీని ఉంచి సంప్రదాయంగా పద్ధతిలో వేడుకలు జరుపుకున్నారు.

అయితే ఈ వీడియోను మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీటర్ లో పోస్ట్ చేయడంతో పలువురు వీడియోను చూసి కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube