ప్రభుత్వానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా( Bank Of Baroda ) రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 0.5 శాతం పెంచింది.దీని అర్థం కస్టమర్లు ఇప్పుడు వారి ఎఫ్‌డీలపై( Fixed Deposits ) ఎక్కువ వడ్డీని పొందుతారు.
కొత్త వడ్డీ రేట్లు 2023, అక్టోబర్ 9 నుంచి అమలులోకి వచ్చాయి.ఇప్పటికే ఎఫ్‌డీలు ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు కూడా పెరిగిన వడ్డీ రేట్ల నుంచి ప్రయోజనం పొందుతారు.రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటును బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది కాబట్టి సామాన్యులు బాగా లాభం పొందొచ్చు
బ్యాంక్ ఇప్పుడు 2 నుండి 3 సంవత్సరాల ఎఫ్‌డీలపై తన కస్టమర్లకు గరిష్టంగా 7.25% వడ్డీ రేటును అందిస్తోంది.సీనియర్ సిటిజన్లు( Senior Citizens ) 2 నుంచి 3 సంవత్సరాల ఎఫ్‌డీలపై గరిష్టంగా 7.75% వడ్డీని పొందవచ్చు.అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీలో 2 సంవత్సరాల పాటు 7.25% వడ్డీకి రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే, వడ్డీ రూపంలో రూ.7,250 పొందుతారు.బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీలో 2 సంవత్సరాల పాటు 7.75% వడ్డీకి (మీరు సీనియర్ సిటిజన్ అయితే) రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే, మీరు వడ్డీ రూపంలో రూ.7,750 పొందుతారు.
జనరల్ పబ్లిక్ అయి ఉండి రూ.5 లక్షలు మూడేళ్ల పాటు ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా లో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ టైమ్‌లో రూ.6,20,273 పొందవచ్చు.అంటే వడ్డీ రూపంలో( Interest ) రూ.1,20,273 సొంతం చేసుకోవచ్చు.అదే సీనియర్ సిటిజన్ అయితే ఐదు లక్షల డిపాజిట్ పై వడ్డీగా రూ.1,29,474 పొందవచ్చు.ఒకవేళ రూ.7 లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీగా రూ.1,68,383, సీనియర్ సిటిజన్లు రూ.1,81,263 పొందవచ్చు.ఇక జనరల్ పబ్లిక్ అయి ఉండి మూడేళ్ల పాటు రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.2,40,547 రిటర్న్స్ అందుకోవచ్చు.సీనియర్ సిటిజన్లు అయితే రూ.2,58,948 రాబడి సంపాదించొచ్చు.