నాలుగో విడత యాత్రకు ' బండి ' రెడీ ! ఈ విధంగా ముందుకు 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరో మారు తన ప్రజా సంగ్రామ యాత్రను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది.

 'bandi' Is Ready For The Fourth Installment Of The Trip! Proceed In This Way, Ba-TeluguStop.com

గతంలో మూడు విడతల్లో నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడంతోపాటు, కేంద్ర బిజెపి పెద్దల ప్రశంసలు సంజయ్ కు దక్కాయి.  మొదటి , రెండు, మూడో విడత పాదయాత్ర ముగింపు సభలకు కేంద్ర మంత్రులు , బిజెపి ఆగ్రహం నేతలు హాజరు కావడం,  భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ,  టిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకు పడడం, ఈ సభలకు భారీగా జన సమీకరణ చేపట్టడం ఎలా అనేక కారణాలతో మూడు విడతల్లో చేపట్టిన పాదయాత్ర సక్సెస్ అయింది.

అదే ఉత్సాహంతో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టేందుకు సంజయ్ సిద్ధమయ్యారు .త్వరలోనే  మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో , సంజయ్ పాదయాత్ర  పై అందరికీ ఆసక్తి పెరిగింది.ఇదిలా ఉంటే సంజయ్ సంగ్రామ యాత్ర ఈ విధంగా ముందుకు వెళ్లబోతోంది.ఈనెల 12వ తేదీన ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్ర పది రోజుల పాటు జరగనుంది.

ఈనెల 22 వరకు జరగబోయే ఈ యాత్ర ఇబ్రహీంపట్నం వరకు కొనసాగుతుంది.నాలుగో విడతలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది.రోజుకు కనీసం 10 కిలోమీటర్లు చొప్పున సంజయ్ యాత్ర ను కొనసాగిస్తారు.కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర  సేర్ లింగంపల్లి , కూకట్ పల్లి,  సికింద్రాబాద్ ,కంటోన్మెంట్ , మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బి నగర్, ఇబ్రహీంపట్నం మీదుగా కొనసాగుతుంది.
 

Telugu Bandi Sanjay, Munugoduasembly, Telangana Bjp, Telangana, Trs-Politics

22వ తేదీన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డులో ఈ సభను ముగించనున్నారు.ముగింపు రోజున భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.ఈ ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు , జన సమీకరణ చేపట్టనున్నారు .ఇక ముగింపు సభ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరు కాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube