తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ లాస్య ఒకరు.ఎంతో అల్లరి అల్లరి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నటువంటి ఈమె పెళ్లి తర్వాత బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరమయ్యారు.
ఇక వివాహం తర్వాత బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో సందడి చేసిన లాస్య సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకోవడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక లాస్య సోషల్ మీడియా వేదికగా తన కుమారుడు జున్ను గురించి ఎన్నో వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా నిత్యం ఎంతో చలాకీగా ఉండే లాస్య ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది.ఇలా హాస్పిటల్ బెడ్ పై ఉన్నటువంటి ఈమె ఫోటోలను తన భర్త మంజునాథ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గెట్ వెల్ సూన్ అంటూ పోస్ట్ పెట్టారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అవ్వడమే కాకుండా అసలు లాస్యకు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

లాస్య హాస్పిటల్ లోఅడ్మిట్ అయినట్టు భర్త మంజునాథ్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఏ కారణం చేత ఆమె అడ్మిట్ అయ్యారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం లాస్య గత కొన్ని రోజులకు వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతుందని అయితే ఈ ఫీవర్ కారణంగా ఈమె ఎంతో నీరసించి పోవడంతోనే తన భర్త తనని హాస్పిటల్లో చేర్పించారని తెలుస్తోంది.ఈమె ఆస్పత్రి ఫాలవడానికి సరైన కారణం తెలియక పోయినప్పటికీ ఈమె తొందరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







